TG: వరిధాన్యం సేకరణ అతి ముఖ్యమైన అంశమని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణపై కేబినెట్ సమావేశంలో చర్చించలేదన్నారు. రైతులు క్వింటాల్‌కు రూ.250 నష్టపోతున్నారని తెలిపారు. ఇది ప్రభుత్వ వైఫల్యం.. ఆర్ఆర్ ట్యాక్స్ కిందకు వస్తుందని చెప్పారు. రైతు భరోసా, పంటలకు బోనస్ ఇవ్వడం లేదని ఆరోపించారు. మంత్రులు ఏం చేస్తున్నారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.