విద్యార్థి మృతి చెందాడని చెప్పి సెలవు తీసుకున్న టీచర్ సస్పెండ్‌కు గురైన ఘటన MP మౌగంజ్ జిల్లాలో జరిగింది. చిగ్రిక తోలాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా హీరాలాల్ పనిచేస్తున్నాడు. 3వ తరగతి విద్యార్థి మృతిచెందాడని, ఆ బాలుడి అంత్యక్రియలకు వెళ్తున్నానని చెప్పి సెలవు తీసుకున్నాడు. ఈ విషయం బాలుడి తండ్రికి తెలియడంతో ఆగ్రహించిన అతను టీచర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో టీచర్‌ను సస్పెండ్ చేశారు.