బీహార్ ఎన్నికల్లో NDA కూటమి సాధించిన విజయంపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఈ విజయం ప్రధాని మోదీ, సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ విధానాలపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. ‘జంగల్రాజ్’, అవినీతిని రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారని.. సుపరిపాలన, స్థిరత్వం, అభివృద్ధికి ఓటేశారని నడ్డా పోస్ట్ చేశారు.