AP: గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 22ఏ జాబితా నుంచి తప్పించాలని కోరుతూ 6,846 దరఖాస్తులు దాఖలయ్యాయని సీఎం చంద్రబాబుకు అధికారుల తెలిపారు. EX సర్వీస్మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములు 22A నుంచి తొలగించారని చెప్పారు. 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తిచేసి వెబ్ ల్యాండ్ 2.0లో వివరాల నమోదు చేశామన్నారు.