TG జూబ్లీహిల్స్ ప్రజల తీర్పును శిరసావహిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లో తమకు పెద్దగా బలం లేదన్నారు. MIM సపోర్టుతో కాంగ్రెస్ గెలిచిందన్న కిషన్ రెడ్డి.. BJP గెలుపునకు తమ శక్తినంతా కూడగట్టి ప్రచారం చేశామన్నారు. ఇక్కడ తమకు కార్పొరేటర్లు లేరన్నారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ సీటును గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.