గ్లోబల్ సమ్మిట్ ఎక్స్ పోలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మోడల్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ గోషామహల్‌లోని 26 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు. మొత్తం 2,700 కోట్లతో నిర్మాణం చేస్తున్నారు. ఎక్స్‌పోలో ఉస్మానియా హాస్పిటల్ చరిత్ర, అందులో అందించే ట్రీట్మెంట్తో పాటు మెడికల్ కాలేజ్ విషయాలను ప్రదర్శించారు.