బాదం పాలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తాయి. బరువును అదుపులో ఉంచుతాయి. చర్మాన్ని తేమగా ఉంచి వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కంటి సమస్యలను దూరం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.