ఆర్మీ జనరల్స్‌పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో భయానిక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడాలని ఆర్మీ జనరల్స్‌పై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని సైనికాధికారులే బయటకు వచ్చి చెబుతున్నారని తెలిపారు.