TG: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా CM రేవంత్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అందించే అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. భోజనం తయారీలో పారదర్శకత, పరిశుభ్రత ఉండేలా ప్రతి 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.