AP: బీహార్లో ఎన్టీయే కూటమి విజయంపై స్పందిస్తూ.. ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ పోస్టు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన విజయం.. న-ని ( నరేంద్ర మోదీ- నితీష్ కుమార్)ల మ్యాజిక్కే ఇందుకు కారణమని కొనియాడారు. ఘన విజయాన్ని సాధించనున్న బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.