‘నేను ఈ పని చేయగలను అనుకుంటున్నాను’ అని చెప్పడం కాదు. ‘ఎలాగైనా సరే ఈ పని పూర్తయ్యేలా చూస్తాను’ అని ధైర్యంగా చెప్పగలిగేలా ఉండాలి. మీ ఆలోచనా విధానాన్ని ఇలా మార్చుకోవడం అత్యంత కీలకం. అదే మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఇతరులు మీకు అవకాశాలు ఇవ్వడానికి దోహదం చేస్తుంది.