AP: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆరు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించారు. కార్పొరేషన్‌కు 15 మంది చొప్పున 90 మంది డైరెక్టర్లను నియమించారు. కురుబ, కళింగ, వన్యకుల, ఆర్యవైశ్య, శెట్టిబలిజ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు నియమించారు. అయితే, ప్రతి కార్పొరేషన్లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ నేతకు డైరెక్టర్‌గా అవకాశం కల్పించారు.