బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA భారీ విజయం సాధించడంతో సీఎం అభ్యర్థిపై తర్జనభర్జన జరుగుతోంది. తారాపుర్ నుంచి గెలిచిన ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరీకి సీఎం పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి సీఎం కుర్చీని దక్కించుకోవాలని భావిస్తోందట. ఈ నేపథ్యంలో ఇప్పటికే సామ్రాట్ చౌధరీ.. నితీష్ నివాసానికి చేరుకున్నారు.