TG: ఇప్పటికైనా హరీష్ రావు అసూయ.. కేటీఆర్ పొగరు, అహంకారం తగ్గించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేటీఆర్ నా కంటే చిన్నవాడు. ఆయన భాష మార్చుకోవాలి. మనమంతా రాజకీయాల్లో ఇంకా చాలా రోజులు ఉండాలి. శాశ్వతంగా అధికారంలో ఎవరూ ఉండరు. వారసత్వంగా రావడానికి ఇదేం తాతల ఆస్తి కాదు. సంయనంతో ముందుకు పోవాలి’ అని అన్నారు.