TG: మత కల్లోలాలు సృష్టించేందుకే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. షాద్‌నగర్‌లోని వివేకానంద కాలనీ బసవన్న దేవాలయ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ఎత్తుకెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. దేవాలయాలపై దాడులు చేయడం వికృతమైన చర్య అన్నారు.