AP: 1968లో రాజారెడ్డి సతీమణి జయమ్మ పులివెందుల సర్పంచ్ ఎన్నికల్లో, వార్డు మెంబర్ పదవికి కూడా పోటీచేసి కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. ఓటమి చరిత్ర ఆనాడే వైఎస్ కుటుంబంలో మొదలైందన్నారు. నమ్మి పెట్టుబడి పెట్టిన వెంకటనరసయ్యను దారుణంగా హత్యచేసిన చరిత్ర మీదన్నారు. పెట్టుబడి లేకుండా వ్యాపారం చేసుకోవాలని సహకరించిన వ్యక్తినే చంపేస్తారా అని ప్రశ్నించారు.