అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుపై పెంటగాన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజా పర్యటన.. అమెరికా సర్కారు అసమర్ధత, వైఫల్యంగానే కనిపిస్తోందని అన్నారు. అమెరికాలో మెజారిటీ ప్రజలు ట్రంప్‌ను ఇష్టపడటం లేదన్నారు. భారత్ లాంటి మిత్రదేశాన్ని రష్యాకు ట్రంప్ వదిలేయడాన్ని అమెరికన్లు అసలు స్వాగతించరని రూబిన్ పేర్కొన్నారు.