మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో మహాయుతి(BJP) కూటమి 214 సీట్ల భారీ ఆధిక్యంలో ఉండగా.. మహా వికాస్ అఘాడీ(CONG) కూటమి 59 సీట్ల ఆధిక్యానికే పరిమితమైంది. మరోవైపు ఇందుకు భిన్నంగా జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి 50 సీట్ల పూర్తి ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కూటమి 29 సీట్ల లీడ్‌తో సరిపెట్టుకుంది. కాగా, చివరి వరకు ఈ ఫలితాలు మారే అవకాశం ఉండవచ్చు.