AP: రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. ఆ టెక్నాలజీల్లో నిపుణులైన వారికోసం ప్రారంభిస్తున్న కోర్సుకు విశేష స్పందన లభించింది. 50 వేల మందికి శిక్షణ ఇవ్వాలని గత నెల 19న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించింది. శనివారం నాటికి 51,820 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రేపటి నుంచి కోర్సు ప్రారంభం కానుంది.