AP: ప్రకాశం జిల్లా సంతమాగులూరులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా బండివారిపాలెంలో పీఎం సూర్యఘర్ పథకంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇంధన పొదుపు చర్యల్లో భాగంగానే పీఎం సూర్యఘర్ అమలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా కోటి కనెక్షన్లు ఇస్తుంటే.. ఏపీకే 20 లక్షలు వస్తున్నాయి’ అని తెలిపారు.