TG: బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్ బెంచ్‌లో అసెంబ్లీ సెక్రటరీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. అనంతరం హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.