తమిళనాడు కరూర్‌లో 41 మంది మరణానికి కారణమైన తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘కరూర్‌లో జరిగిన దానికి అందరూ బాధ్యులే, కానీ ఒకరు మాత్రం అత్యంత ప్రధాన బాధ్యులుగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన నేరుగా విజయ్‌ని ఉద్ధేశించారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.