బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి 69.6 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో పెరిగిన ఓటింగ్ తమ కూటమికి అనుకూలమని NDA కూటమి ధీమాగా ఉంది. అదే సమయంలో పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నం అని.. ప్రజలు తమ కూటమికి ఓటు వేశారని మహాఘఠ్ బంధన్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ప్రజలు ఎటు వైపు ఉన్నారనేది కాసేపట్లో తేలనుంది.