AP: అన్నమయ్య జిల్లాలో CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కులం, మతం, ప్రాంతీయవాదమే పెద్ద సమస్య అని అన్నారు. స్థానికుడు, కులపోడు అయితే చాలు ఏం చేయకపోయినా ఓటేస్తారని వ్యాఖ్యానించారు. దీని వల్ల నాయకులకు కాదని.. ప్రజలకే నష్టమన్నారు. తాను అభివృద్ధి చేస్తుంటే వేరేవాళ్లు వచ్చి నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు.