AP: రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని.. రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు, అశాంతి తలెత్తేలా ప్రభుత్వమే ప్రయత్నించడం దారుణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జగన్ తిరుమల వెళ్తుంటే ప్రభుత్వానికి ఆందోళన ఎందుకు అంటూ ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామిని మాజీ సీఎం దర్శించుకోవడానికి అనుమతి లేకపోవడమేంటి? అంటూ నిలదీశారు. దైవ దర్శనానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం ఏనాడైనా ఉందా? అని ధ్వజమెత్తారు.