రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రష్యాకు ఆయుధాలు పంపిస్తామని ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ జావేద్ జరీఫ్ ప్రకటించారు. కష్టకాలంలో సాయం చేసిన వారిని టెహ్రాన్ ఎప్పటికీ మరిచిపోదని వెల్లడించారు. ఉక్రెయిన్‌తో జరిగే యుద్ధం కోసం రష్యాకు ఆయుధాలను సరఫరా చేస్తూ ఆర్థికంగానూ లాభాలు సంపాదిస్తామని తెలిపారు. యుద్ధం సమస్య పరిష్కారం కాదంటూనే డబ్బు సంపాదించడం కోసం రష్యాతో వ్యాపారం చేస్తామని పేర్కొన్నారు.