ఛట్ పూజ, దీపావళి సందర్భంగా రైల్వే కోచ్ల సంఖ్యను పెంచుతున్నట్లు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. అదనంగా 12,500 కోచ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 108 రైళ్లకు జనరల్ కోచ్ల సంఖ్యను పెంచినట్లు వెల్లడించారు. గణేశ్ ఉత్సవాల కోసం 342 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడిపిందని అన్నారు. 2024-25లో పండగ వేళలో మొత్తం 5,975 రైళ్లను నడపనున్నట్లు ఇప్పటికే ప్రకటించినట్లు పేర్కొన్నారు.