AP: తిరుమల నెయ్యి వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని VHP అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి శర్మ అన్నారు. నెయ్యి కల్తీ వాస్తవమా కాదా అనే అనుమానాలున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలతో విచారణపై నమ్మకం లేదని.. ప్రభుత్వం ఎవరిదైనా వాళ్ల పక్షాన విచారం అజరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తున్నామని చెప్పారు.