జపాన్ తదుపరి ప్రధానిగా మాజీ రక్షణమంత్రి షిగెరు ఇషిబా వచ్చేవారం బాధ్యతలు చేపట్టనున్నారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. దీంతో ఇషిబా దేశ 102వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, ఎల్డీపీ పార్టీ అధ్యక్షుడిగా 2021లో కిషిద ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన మూడేళ్ల పదవీకాలం ఈ సెప్టెంబరుతో ముగుస్తుంది. దీంతో పార్టీకి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు.