US: కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో ఉన్న బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిరంపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు. తాజాగా ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి అధికారులను భారత కాన్సులేట్ జనరల్ డిమాండ్ చేసింది. ఇక ఆ హిందూ ఆలయం గోడలపై దుండగులు హిందువులు గో బ్యాక్ అనే నినాదాన్ని రాశారు.