దక్షిణ కొరియాతో సరిహద్దును పంచుకునే రోడ్లు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒక్క వారంలోనే ఉత్తర కొరియా సైన్యంలోకి 14లక్షల మంది యువత చేరారట. లక్షలాది మంది విద్యార్థులు, యూత్ లీగ్ అధికారులు ఆర్మీలో చేరగా.. కొందరు సర్వీసులోకి తిరిగి వచ్చారట. యువకులు పవిత్ర యుద్ధంలో పోరాడాలని నిర్ణయించుకున్నారని, వారు విప్లవ ఆయుధాలతో శత్రువును నాశనం చేస్తారని అక్కడి మీడియా పేర్కొంది.