TG: సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. ‘నా ఫామ్ హౌస్కు అధికారులను పంపించండి. FTL, బఫర్ జోన్లో నిర్మాణం ఉంటే మార్క్ చేయాలి. నా సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తా. నాకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు అవసరం లేదు. చట్టాన్ని.. తన పని తాను చేసుకోనివ్వండి. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు’ అని లేఖలో పేర్కొన్నారు.