ఢిల్లీలో వాతావరణం మరింత ప్రమాదకరంగా మారింది. శుక్రవారం 398గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. నిన్న 407గా నమోదై.. నేడు మరింత క్షిణించి 437కు పడిపోయింది. పీల్చే గాలిలో నాణ్యత క్షీణించడంతో ఢిల్లీ వాసులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పలువురు కళ్లు మంటలు, దగ్గు, తలనొప్పి, శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.