TG: రాష్ట్రంలో బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ సహా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. కులగణనపై హైకోర్టు తీర్పుపై సీఎం, మంత్రులు, అధికారులు చర్చిస్తున్నారు.