దేశంలో ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ ఒకసారి అధికారంలోకి వస్తే ప్రజలు సుదీర్ఘకాలం ఆదరిస్తారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీకి ‘నో ఎంట్రీ’ బోర్డులు పెడతారని ఎద్దేవా చేశారు. హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీకి విజయం కట్టబెట్టిన ప్రజలు అసత్యాలు మాట్లాడేవారిని దూరం పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి తిరస్కరించిన ప్రజలు మళ్లీ ఆదరించడం చాలా అరుదని తెలిపారు.