ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు యూఎస్ కోర్టు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాకు యువత బానిస అవుతున్నారని, దానికి కారణం ఫేస్బుక్ మాతృసంస్థ మెటానేనని అమెరికా రాష్ట్రాలు పిటిషిన్ దాఖలు చేశాయి. దీంతో వాటిని కొట్టేయాలని మెటా కోర్టును ఆశ్రయించింది. మెటా వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. విచారణను కంపెనీ ఎదుర్కోవాల్సిందేనని కాలిఫోర్నియా ఫెడరల్ జడ్జి పేర్కొన్నారు.