TG: ఫాక్స్‌కాన్ పరిశ్రమపై మాజీమంత్రి కేటీఆర్ ఎక్స్‌లో స్పందించారు. ‘లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్‌కాన్ పరిశ్రమను మేం తీసుకొచ్చాం. మరికొన్ని నెలల్లో ఫాక్స్‌కాన్ ప్రారంభం కావటం గర్వంగా ఉంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టి మరింత విస్తరిస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా, కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కంపెనీని సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించిన విషయం తెలిసిందే.