పాకిస్తాన్లో రెండు రోజులపాటు షాంఘై సహకార సంస్థ(SCO) సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాక్‌లోని ఇస్లామాబాద్ చేరుకున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సభ్యదేశాల నుంచి అగ్రనేతలు పాల్గొనున్నారు.