AP: తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. హైందవ సంస్కృతిని పవన్ కించపరుస్తున్నారని విమర్శించారు. సనాతన ధర్మం గురించి ఓనమాలు అయినా తెలుసా అని ప్రశ్నించారు. పవన్ ఒక క్షుద్ర రాజకీయ నాయకుడన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతికి వచ్చినట్లు ఉందని ఎద్దేవా చేశారు.