AP: ముంబయి నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇంతకు ముందు జరిగిన విచారణలో నేటి వరకు తొందరపాటు చర్యలు వద్దు అని ఆదేశించింది. కాగా ముందస్తు బెయిల్ కోరుతూ కాంతిరాణా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ, అడ్వకేట్ ఇంకొల్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో జెత్వాని కూడా ఇంప్లీడ్ అయింది.