మోదీ ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ ఇండియా కోసం కృషి చేస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. రూ.5,600 కోట్ల విలువైన డ్రగ్స్ దందాలో కాంగ్రెస్ నేత పేరు బయటకు వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పంజాబ్, హర్యానా, ఉత్తర భారతంలో డ్రగ్స్ ఏ విధంగా సరఫరా అయ్యేవో అందరికీ తెలిసిన విషయమని గుర్తు చేశారు. డ్రగ్స్ డీలర్ల రాజకీయ పలుకుబడితో సంబంధం లేకుండా ఆ నెట్వర్క్ ఎక్కడున్నా మోదీ ప్రభుత్వం పెకలించి వేస్తుందని స్పష్టం చేశారు.