ఆర్థిక సంస్థల విలువ ట్రంప్ తెలుసుకోవాలని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బాంగా తెలిపారు. ఆర్థిక సంస్థలు ఇచ్చే రుణాలు అమెరికా కంపెనీలు విదేశాల్లో విస్తరించడానికి ఎలా దోహదపడుతున్నాయో తెలుసుకోవాలన్నారు.ట్రంప్ హయాంలోనే ‘ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవెలప్మెంట్’ మూలధన పెంపునకు అధికారం వచ్చిందని, దానికున్న విలువను ఆయన అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.