రష్యా తన డ్రోన్ల తయారీ ప్రాజెక్టును చైనాలో చేపట్టినట్లు ఐరోపా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు అల్మాజ్ యాంటే అనుబంధ సంస్థ ఐఈఎంజెడ్ కుపోల్ డ్రోన్ తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. మరోవైపు తమకు ఇలాంటి ప్రాజెక్టు గురించి ఏమీ తెలియదని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.