TG: ఢిల్లీలో పెసా చట్టంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ‘గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు.. అనుమతులు అడ్డంకిగా మారుతున్నాయి. కేంద్రం నిధులు ఇస్తున్నా వినియోగించలేని పరిస్థితి ఉంది. గ్రామ సభలకు అనుమతుల అధికారం కట్టబెట్టాలి. అటవీ, పర్యావరణ అనుమతుల్లో ఆటంకాల వల్ల.. ఇప్పటికీ రోడ్లు, విద్యుత్ వసతులు లేవు’ అని వెల్లడించారు.