AP: సీఎం చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ జీతాలు కూడా చెల్లించడం లేదని ఆయన విమర్శించారు. రూ.400 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసినా నిధులు మాత్రం రాలేదని దుయ్యబట్టారు. సమగ్ర శిక్షణలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు 2 నెలలుగా జీతాలు లేవని అన్నారు. చిరుద్యోగుల జీవితాల్లో దసరా, దీపావళి పండుగలు వస్తున్నా చిమ్మ చీకట్లు తొలగిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.