హర్యానాలోని జులానా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, రెజ్లర్ వినేశ్ ఫొగట్ గెలుపొందిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న ఆమె.. ఎన్నికల సమరంలో మాత్రం గెలుపొందారు. గెలుపు అనంతరం వినేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజల ప్రేమ ఫలితాల్లో కనిపించింది. ఇది ప్రజల పోరాటం. అందులో వారు గెలిచారు. రాబోయే ఐదేళ్లపాటు ప్రజల అంచనాలు అందుకోవడానికి కృషి చేస్తా’ అని పేర్కొన్నారు.