యంగ్ హీరో శర్వానంద్ హీరోగా.. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా తెరకెక్కింది. రీతూ వర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో.. అమల అక్కినేని కీలక పాత్రలో నటిచింది. టైం ట్రావెల్ కథతో.. థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ‘ఒకే ఒక జీవితం’ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. దాంతో గత కొంత కాలంగా ఫ్లాపుల్లో ఉన్న శర్వా.. ఈ సారి హిట్ కొట్టేలానే ఉన్నాడని అంటున్నారు. అందుకే గట్టిగా ప్రమోషన్ చేయాలని భావిస్తున్నాడు శర్వా. ఈ క్రమంలో తనతో క్లోజ్‌గా ఉండే ప్రభాస్, రామ్ చరణ్‌ను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే చిత్ర యూనిట్‌కు సోషల్ మీడియా వేదికగా.. ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలిపాడు రామ్ చరణ్. ‘ఒకే ఒక జీవితం’ ట్రైలర్ చూసి.. ఎంతో బాగుందని శర్వానంద్‌కి బెస్ట్ విషెస్ తెలుపుతూ.. రామ్ చరణ్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ఈ సినిమాని ప్రభాస్, చరణ్‌ల కోసం స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నాడట. రిలీజ్‌కు ముందే ‘ఒకే ఒక జీవితం’ స్పెషల్ ప్రీమియర్స్ వేయనున్నట్టు టాక్. ఇక సినిమా చూసిన తర్వాత ప్రభాస్, చరణ్ సినిమా పై అంచనాలను పెంచేయడం పక్కా అని చెప్పొచ్చు. దానికి తోడు ఏ మాత్రం కంటెంట్ బాగుందని టాక్ వచ్చిన శర్వాకు హిట్ ఖాయం. ఏదేమైనా.. హిట్ కోసం తన దగ్గరున్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా.. శర్వానంద్ వదులుకునే ఛాన్స్ లేదనే చెప్పాలి.