సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ‘SSMB 29’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం కాశీ క్షేత్రానికి సంబంధించిన భారీ సెట్‌ను కూడా వేస్తున్నట్లు సమాచారం. ఈ నెల రెండో వారం నుంచి జరగనున్న ఈ షెడ్యూల్లో మహేష్‌పై యాక్షన్ సీన్స్‌తో పాటు ఓ పాటను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.