రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. దీనిపై సందీప్ రెడ్డి స్పష్టతనిచ్చాడు. ఈ చిత్రంలో మెగాస్టార్ నటించడం లేదని పేర్కొన్నాడు. చిరంజీవితో ఒకవేళ తను సినిమా చేస్తే సోలో చిత్రం తీస్తానని వెల్లడించాడు.