గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్ నటి శోభన భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె కీలక పాత్రలో కనిపించనున్నట్లు, ఆ పాత్ర ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.